Huzurabad: త్వరలోనే కవితమ్మ సీఎం తెలంగాణ రక్షణ సేన నేత హరిప్రసాద్!

Huzurabad: హుజూరాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ. కవితమ్మ నాయకత్వంలోనే ఉచిత విద్య, వైద్యం లభిస్తుందని కరీంనగర్ జిల్లా బాధ్యుడు హరిప్రసాద్ వెల్లడి.

GANESH, JAMMIKUNTA
Published on: 21 July 2026 8:44 AM IST
Huzurabad
X

Huzurabad: త్వరలోనే కవితమ్మ సీఎం తెలంగాణ రక్షణ సేన నేత హరిప్రసాద్!

Huzurabad: ఈ రాష్ట్రానికి త్వరలోనే కవితమ్మ ముఖ్యమంత్రి అవుతుంది.

తెలంగాణ రక్షణ సేన ను గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తాం.

ప్రజలకు తెలంగాణ రక్షణ సేన ఒక రక్షణ కవచంగా ప‌ఇ చేస్తుంది.

ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర కేవలం తెలంగాణ రక్షణ సేన మాత్రమే పోషిస్తుంది.

కాంగ్రెస్, బిజెపి భారతీయ రాష్ట్ర సమితి మూడు పార్టీలు అంతర్గతంగా కలిసి పోయాయి.

గుంజపడుగు హరిప్రసాద్

జిల్లా బాధ్యుడు

తెలంగాణ రక్షణ సేన, కరీంనగర్

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ సీనియర్ నాయకులు పొన్నం శిరీష దీటి రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈకార్యక్రమానికి ముఖ్యాతిథిగా తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ హాజరై ఎర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీ కవితక్క నాయకత్వంలో పాంచజన్యంతో ప్రజల ముందుకు వచ్చిందని అందులో ముఖ్యంగా ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, కష్టాలు లేని రైతాంగాన్ని చూడాలని రైతేనే రాజు చెయ్యలని వారు అన్నారు, నిరుద్యోగులకు అవకాశాలు సామాజిక తెలంగాణనే లక్ష్యంగా పాంచజన్యం పథకాలను కవితమ్మ ఏర్పాటు చేశారని వారు అన్నారు.

గత రెండున్నర సంవత్సరాలు తెలంగాణ ప్రజల కోసం నిరంతరం ఈ కర్కోటక ప్రభుత్వం పైన పోరాటం చేస్తుందని వారు అన్నారు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసే ఏకైక నాయకురాలు కూడ కవితమ్మనే బీసీ నినాదాన్ని ఎత్తుకుని బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. రేపు కవితమ్మ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి వస్తే సబ్బండ వర్గాలకు సమ న్యాయం జరుగుతుందని ప్రస్తుతం తెలంగాణలో విద్య మరియు వైద్యం వ్యాపార కేంద్రాలుగా మారయాని కవితమ్మ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య అందించి నేటి బాలలను రేపటి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని వారన్నారు.

ఉచిత వైద్యం సామాన్యు ప్రజలకు అందించి వారి ఆరోగ్యన్ని కాపాడుతుందని తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటుదని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఏ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తెచ్చుకున్నమో ఆ హక్కులు కేవలం తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ ద్వారానే నెరవేరుతాయి తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.

ఈసమావేశంలో జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి, ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, మనకోండుర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు బుడిగె పరుశురాం గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు, రంగరవేణి లక్ష్మణ్, ఏనుగు మల్లారెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గం నాయకులు సురేష్, రాజ్ కుమార్, బండ అశోక్, జంపాల రితేష్, అంబాల హరీష్, కొతురి నరేష్ , గుండారపు కిరణ్, యువ నాయకులు నూతి సాయి చరణ్, మహిళ విభాగం సీనియర్ నాయకురాలు ఎండి సల్మా, అతాహర్, కొలిపాక గౌతమి, కుతాడి రజిత, జంగా అపర్ణ, దాసరి అంజలి లతోపాటు దాదాపు వంద మంది పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story