Ramagundam: రామగుండం మున్సిపల్ అధికారులపై ఆర్టీఐ కమిషనర్ ఆగ్రహం!
Ramagundam: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌పై రాష్ట్ర సమాచార కమిషనర్ ఆగ్రహం అక్రమ నిర్మాణాల వివరాలు దాచడంపై మండిపాటు 15 రోజుల్లో సమాచారం ఇవ్వాలని ఆదేశం.
Ramagundam: రామగుండం మున్సిపల్ అధికారులపై ఆర్టీఐ కమిషనర్ ఆగ్రహం!
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ నిర్మాణాలు, అక్రమ నిర్మాణాల సమాచారాన్ని సమాచార హక్కు చట్టం (RTI) కింద ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ దాఖలు చేసిన అప్పీల్‌పై నేడు శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కార్యాలయం లో విచారణ కొనసాగింది. ఈ విచారణకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ హాజరై తన వాదనలు వినిపించారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కోరిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో ఇవ్వకుండా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్య ధోరణి వహిస్తూ, నియంతృత్వంగ వ్యవహరిస్తుందని, అడిగిన సమాచారన్ని అందించడంలో ఎందుకు జంకుతున్నారో అర్ధం కాని పరిస్థితి అని అడిగిన సమాచారాన్ని అందించకపోవడంపై విచారణ సందర్భంగా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మద్దెల దినేష్ తెలిపారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కమిషనర్ . ప్రజలకు కల్పించిన హక్కు అని, ప్రజలు కోరిన సమాచారాన్ని చట్టప్రకారం అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు దాచిపెట్టకుండా పారదర్శకంగా అందించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీఐ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ముందుకు సాగాలన్నారు. డిసెంబర్ 25న రామగుండం నగరపాలక అధికారులు సమాచారాన్ని కోరగా 30రోజుల్లో సమాచారం పాలక సంస్థ సమాచారాన్ని సమాచారాన్ని అందించలేకపోవడం పై అధికారులను నీలాదీశారు.
అదే విధంగా ఇట్టి సమాచారాన్ని మెదటి అప్పిల్ దరఖాస్తు పెట్టినప్పటికి కూడ స్పదించలేకపోయారని దీనికి సమాచార హక్కు చట్టం కమిషనర్ తివ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసారని, చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు భారీగా ఫైన్లు తప్పవని , మరొక 15రోజులు గడువు లోపు అందించాలని నిర్ణయించింది , అయినప్పటికీ సమాచారం ఫిర్యాదు దారుడికి అందించకపోతే కార్పొరేషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులకు షోకాజ్ నోటీస్ లు జారి చేస్తామని కమిషన్ హెచ్చరించిందని దినేష్ పేర్కొన్నారు.




