Manthani: శ్రీ ఆదివార స్వామి జయంతి ఉత్సవాలకు అడిషనల్ కలెక్టర్‌కు ఆహ్వానం!

Manthani: శ్రీ ఆదివార స్వామి జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీకి అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు.

SHANKAR, MANTHANI
Published on: 22 Aug 2026 7:03 PM IST
Manthani
X

Manthani: శ్రీ ఆదివార స్వామి జయంతి ఉత్సవాలకు అడిషనల్ కలెక్టర్‌కు ఆహ్వానం!

మంథాని: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని స్వయంభు ప్రసిద్ధ శ్రీ ఆదివార స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వివిధ పూజలు, హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు.

ఉత్సవాల సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని కోరారు.

ఈ నేపథ్యంలో శనివారం ఉత్సవాల ఆహ్వాన పత్రికను పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) అరుణ శ్రీకి ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈఓ కాంతారెడ్డి, డైరెక్టర్ చాట్ల రాయమల్లు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని అడిషనల్ కలెక్టర్‌ను వారు ఆహ్వానించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story