Sircilla: వేణుగోపాల స్వామి భక్తోత్సవాలకు కేటీఆర్‌కు ఆలయ కమిటీ ఆహ్వానం!

Sircilla: ఎల్లారెడ్డిపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్షిక భక్తోత్సవాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.

KALEEM, SIRICILLA
Published on: 14 Nov 2026 12:58 PM IST
Sircilla
X

Sircilla: వేణుగోపాల స్వామి భక్తోత్సవాలకు కేటీఆర్‌కు ఆలయ కమిటీ ఆహ్వానం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ వార్షిక భక్తోత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు.

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మీసం రాజం, వెంకటరెడ్డి, అజ్జు, సందీప్‌లు కేటీఆర్‌కు శాలువా కప్పి సత్కరించి భక్తోత్సవాలకు ఆహ్వానించారు.

ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక భక్తోత్సవాలను వైభవంగా జరపాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA