Peddapalli: జాఫర్‌ఖాన్‌పేటలో తీవ్ర ఉద్రిక్తత మాజీ ఎమ్మెల్యే శిలాఫలకం ధ్వంసం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా జాఫర్‌ఖాన్‌పేటలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శిలాఫలకం ధ్వంసం. బిఆర్‌ఎస్ రాస్తారోకో, పోలీసుల అరెస్టులతో తీవ్ర ఉద్రిక్తత.
Peddapalli: జాఫర్‌ఖాన్‌పేటలో తీవ్ర ఉద్రిక్తత మాజీ ఎమ్మెల్యే శిలాఫలకం ధ్వంసం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేటలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత BRS ప్రభుత్వ హయాంలో మద్దెల వాగు బ్రిడ్జ్ శంకుస్థాపన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన శీలాఫలకం గద్దెను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు.
ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీపీ నూనెటి సంపతజ్, మాజీ సర్పంచ్ దొమ్మటి శ్రీనివాస్ తో BRS నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘటన స్థలానికి చేరుకున్నారు. శీలాఫలాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు రాస్తారోకో విరమించాలని కోరగా, BRS శ్రేణులు నిరసనను కొనసాగించాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.శీలాఫలాన్ని కూల్చివేసిన దోషులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.




