Sircilla: సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో తీవ్ర ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.

KALEEM, SIRICILLA
Published on: 17 Jun 2026 9:47 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం

Sircilla: జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో గప్‌చుప్ తిన్న పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సోమవారం సాయంత్రం గప్‌చుప్ (పానీ పూరి)తిన్న అనంతరం మంగళవారం ఉదయం నుంచి పలువురు చిన్నారులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు చిన్నారులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.

అస్వస్థతకు గురైన చిన్నారులకు వైద్య బృందం ప్రత్యేక చికిత్స అందిస్తోంది. పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడించారు.

ఆహార పదార్థాల నాణ్యతపై అధికారులు దృష్టి సారించి, ఘటనకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. స్థానికంగా విక్రయించే ఆహార పదార్థాలను పరిశుభ్రతతో తయారు చేసి విక్రయించాలని అధికారులు సూచించారు.చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్సపై వైద్యురాలు వివరాలు వెల్లడించారు.ఫుడ్ పాయిజన్ ఘటనతో కేసీఆర్ నగర్ కాలనీలో ఆందోళన నెలకొనగా, చిన్నారులందరూ త్వరగా కోలుకోవాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story