Sircilla: గొల్లపల్లిలో విచిత్ర చోరీ వస్తువుల సంచి వదిలేసి వెళ్లిన దొంగ

Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్‌లో చోరీ. నగదు ఎత్తుకెళ్లి చేతి సంచిని షాపు వద్దే వదిలేసిన దొంగ.

KALEEM, SIRICILLA
Published on: 21 Aug 2026 12:18 PM IST
Sircilla
X

Sircilla: గొల్లపల్లిలో విచిత్ర చోరీ వస్తువుల సంచి వదిలేసి వెళ్లిన దొంగ

Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్‌లో చోరీ ఘటన చోటుచేసుకుంది. షాపు ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ధ్వంసం చేసిన దొంగ షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు.

షాపులోని నగదుతో పాటు పలు వస్తువులను అపహరించిన దొంగ కొన్ని వస్తువులను తన చేతి సంచిలో వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సంచిని షాపు వద్దే వదిలి వెళ్లినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి అందుబాటులో ఉన్న ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story