Thimmapur: కాంగ్రెస్ 1000 రోజుల పాలన వేడుకలు - బీఆర్ఎస్పై ధ్వజం
Thimmapur: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో కాంగ్రెస్ 1000 రోజుల పాలనా సంబరాలు ఘనంగా నిర్వహించారు.
Thimmapur: కాంగ్రెస్ 1000 రోజుల పాలన వేడుకలు - బీఆర్ఎస్పై ధ్వజం
తిమ్మాపూర్: రాష్ర్ట కాంగ్రెస్ పిలుపు మేరకు వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఈ రోజు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి రమేష్ మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమ పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లెందుకు కాంగ్రెస్ కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
అసత్యపు ఆరోపణలతో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేపడుతున్నారని, మీ పాలనలో ఎన్ని ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చారని, లక్ష రూపాయల రుణ మాఫీ చేశారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ప్రజలు ని ఓడించారని అన్నారు. బీఆర్ఎస్ వారు అప్పుల రాష్ర్టంగా చేసి నాశనం చేశారని, రేవంత్ రెడ్డి పాలనలో అప్పులు చెల్లిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్నామని తెలిపారు.
రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. పథకాలపై చర్చకు రావాలని బీఆర్ఎస్ కి సవాల్ విసిరారు. గతంలో రోడ్లు వేస్తే గతంలో బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మలను ఊరేగిస్తామని హెచ్చరించారు. ఎవరైనా నాయకులు అసత్య ప్రచారాలు చేసి ఎమ్మెల్యేను అగౌరవపరిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు బండారి రమేష్, సొసైటీ చైర్మన్లు మోరపెల్లి రమణారెడ్డి, గోపు మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, సర్పంచులు గంకిడి లక్ష్మారెడ్డి, జినుక మారుతి,శోభారాణి,కొత్త తిరుపతి రెడ్డి, పొన్నాల చిరంజీవి, కొండాల్ రావు,గొట్టిముక్కల సంపత్ రెడ్డి,దావు సంపత్ రెడ్డి, బుదారపు శ్రీనివాస్,కొమ్మెర మల్లారెడ్డి,శ్రీగిరి రంగారావు, కుంట రాజేందర్ రెడ్డి, పోలు రమేష్, రాము,మామిడి అనిల్ కుమార్, గడ్డం శ్రీనివాస రెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, వీర చంద్రారెడ్డి,రావుల శ్రీనివాస్, కంది లక్ష్మీనారాయణరెడ్డి, తమ్మనవేణి రాములు, ఐతం వెంకన్నం,ఎలుక రాజు, చింతం చంద్రయ్య,మార్క నరసయ్య,బూత్కూరి సంపత్, గాజుల అంజయ్య, కవ్వంపల్లి మహేష్, జినుక శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




