Thimmapur: తిమ్మాపూర్ మండలంలో రీ-సర్వే పకడ్బందీగా చేపట్టాలి: ఆర్డీవో షర్మిల!
Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరుగుతున్న భూముల రీ-సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని ఆర్డీవో షర్మిల శుక్రవారం ఆదేశించారు.
Thimmapur: తిమ్మాపూర్ మండలంలో రీ-సర్వే పకడ్బందీగా చేపట్టాలి: ఆర్డీవో షర్మిల!
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి, మల్లాపూర్, పోరండ్ల గ్రామాల్లో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను జిల్లా రెవెన్యూ అధికారి షర్మిల పరిశీలించారు. తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆమె రీ సర్వే పై అధికారులు మరియు కొత్తపల్లి రైతులతో సమావేశమై క్షేత్ర స్థాయి వివరాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కొత్తపల్లిలో రీ-సర్వే పూర్తయిన నేపథ్యంలో, భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలు వచ్చిన వారికి సెక్షన్ 9(2) నోటీసులు జారీ చేస్తున్న అంశంపై సమావేశంలో చర్చించారు. రైతుకు భూమి కొలతల్లో తేడాలు వస్తె ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై రైతుల అభిప్రాయాలను సేకరించారు.
ఈ సందర్భంగా సర్వే బృందం, తహసీల్దార్ మరియు సంబంధిత అధికారులకు రెవెన్యూ డివిజనల్ అధికారి పలు సూచనలు చేశారు. 9(2) నోటీసుల జారీ గానీ, రీ-సర్వే ప్రక్రియ గానీ పూర్తి పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా, రైతు వద్ద ఉన్న కమతం వివరాలను సరిగ్గా తనిఖీ చేసి నిర్ధారించుకోవాలని ఆదేశించారు.
విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉన్నవారికి నోటీసులు ఇచ్చి, తగిన ఆధారాలు సమర్పించాలని కోరడం ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, DI శ్రీనివాస్, సర్వేయర్ ఇతర రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.




