Thimmapur: రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరు అక్కడికక్కడే మృతి!
Thimmapur: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ రాజీవ్ రహదారిపై దారుణ రోడ్డు ప్రమాదం. కరీంనగర్ వెళ్తున్న ఆటోను కారు ఢీకొనడంతో పర్లపల్లికి చెందిన ఎల్లయ్య మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
Thimmapur: రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరు అక్కడికక్కడే మృతి!
తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో రాజీవ్ రహదారిపై కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుండి కారు ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయం కాగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.
ఆటోలో ఉన్న మరో నలుగురు స్వల్ప గాలతో బయటపడ్డారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి చెందిన ఎల్లయ్య మృతి చెందాడు. వీణవంక కు చెందిన తూర్పట్టి రమేష్ తీర్వంగా గాయపడ్డాడు. స్థానికులు గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story




