Thimmapur: ప్రెస్‌తో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో పోలీస్ విజయం
Thimmapur: తిమ్మాపూర్ వాగేశ్వరీ కళాశాల మైదానంలో పోలీస్, ప్రెస్ జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో సర్కిల్ పోలీస్ జట్టు ఘన విజయం సాధించింది.
Thimmapur: ప్రెస్‌తో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో పోలీస్ విజయం
తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో తిమ్మాపూర్ పోలీస్, ప్రెస్ జట్ల మధ్య రసవత్తరంగా సాగిన క్రికెట్ మ్యాచ్ లో పోలీస్ టీం విజయం సాధించింది. పోలీస్ టీంను సీఐ అనిల్ అభినందించారు. ఈ రోజు తిమ్మాపూర్ సర్కిల్ పోలీస్ జట్టు, ప్రెస్ జట్లు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఆడాయి. ప్రెస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణీత 12 ఓవర్లలో 104 పరుగులు సాధించింది.
తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బి.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ టీం జట్టు ప్రతిభను కనబరచి 11 ఓవర్లలో 105 పరుగులు సాధించి గెలుపొందింది. సీఐ అనిల్ కుమార్ బ్యాటింగ్ లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించారు. పోలీస్ జట్టులో కానిస్టేబుల్ రాజేష్ బ్యాటింగ్ లో, సంతోష్ బౌలింగ్ లో రాణించారు. గెలుపొందిన పోలీస్ జట్టును సీఐ అభినందించారు. ప్రెస్ జట్టులో రాణించిన క్రీడాకారులను సైతం సీఐ అభినందించారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, సమిష్టి కృషితో గెలుపు సాధ్యమవుతుందని సీఐ అనిల్ తెలిపారు. క్రీడలతో ఆరోగ్యంగా ఉంటారని, అందరూ క్రీడల్లో పాల్గొనాలని సీఐ కోరారు.
క్రీడల్లో సీఐ అనిల్ తోపాటు ఎస్సైలు అరుణ్,నరేందర్ రెడ్డి, జగదీష్, వాగేశ్వరి కళాశాల డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బత్తుల రాకేష్, ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజు యాదవ్, సీనియర్ జర్నలిష్టు ముస్కు లక్ష్మారెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్ సిరిసిల్ల అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు నాగెల్లి ఆంజనేయులు, ఎండీ రహీమ్,జర్నలిష్టులు, మేడి గణేష్, కొంపెల్లి సతీష్,చిల్ల రాజ్ కుమార్, మాతంగి రవిందర్, బొమ్మిడి విజయ్, కొమ్మెర రాజిరెడ్డి,లంక స్వామి, కోరెపు అనిల్, మడికంటి శ్రీనివాస్, విజయ్, జర్నలిష్టులు, పోలీసులు పాల్గొన్నారు.




