Karimnagar: తిమ్మాపూర్ మండలంలో వర్షాల కోసం సామూహిక ప్రార్థనలు!
Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో వర్షాలు సమృద్ధిగా కురవాలని సర్పంచ్ ఎలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు.
Karimnagar: తిమ్మాపూర్ మండలంలో వర్షాల కోసం సామూహిక ప్రార్థనలు!
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామ ప్రజలపై ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండాలని సర్పంచ్ ఎలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో గ్రామంలోని దేవతలకు భక్తిశ్రద్ధలతో జలాభిషేకం, వరదపాశం పోసే కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎలుక ఆంజనేయులు మాట్లాడుతూ,గ్రామ ప్రజలు దేవతలకు జాలాభిషేకం చేసి, వర్షాలు రావాలని ప్రజలు సుభిక్షం, ఉండాలని వ్యవసాయాభివృద్ధి కలగాలని ఆ భగవంతున్ని కోరుకున్నామన్నారు. అనంతరం గ్రామ ప్రజలకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలుక అంజనేయులు,మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ కోరేపు లింగారెడ్డి, ఉప సర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




