Thimmapur: తిమ్మాపూర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ
Thimmapur: తిమ్మాపూర్‌లో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. విగ్రహాలపై రాజకీయం వద్దని సూచన.
Thimmapur: తిమ్మాపూర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న మహనీయుల విగ్రహాలను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవిష్కరించారు. దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో Sc, St కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తిమ్మాపూర్ బస్టాండ్ కు చేరుకొని ముసుగులు వేసి ఉన్న అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను ఆవిష్కరించారు.
విగ్రహాల ముసుగులను తొలగించి పూల మాలలు వేసి ఆవిష్కరించినట్లు ఆయన ప్రకటించారు. ముసుగులు వేసి ఉన్న అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించినట్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రకటించారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న స్థల అనుమతి కోసం సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలపై రాజకీయం చేయకూడదని అన్నారు. ఇప్పటికే విగ్రహాలకు రెండుసార్లు ముసుగులు తొలగించినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకులు మళ్లీ ముసుగులు వేసారని అన్నారు.
ఇప్పటికైనా ఎవరు జోక్యం చేసుకోకుండా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ఆర్ ప్రవీణ్, రాంబాబు నాయక్, అంబేద్కర్ సంఘం నాయకులు వంతడుపుల సంపత్, ఎలుక ఆంజనేయులు, సుగుర్తి జగదీశ్వర చారి, సంఘపట్ల మల్లేశం, బోయిని తిరుపతి, మేకల మహేష్, కోయడం మురళి, తాళ్లపల్లి నందకిషోర్, ఎలకపల్లి పరశురాములు, పాశం అశోక్ రెడ్డి, మేకల సునీల్ తదితరులు పాల్గొన్నారు.




