Karimnagar: అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ పోలీసుల ఉక్కుపాదం!

Karimnagar: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు డ్రైవర్లు అదుపులోకి .

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 4 Sept 2026 6:24 PM IST
Karimnagar
X

Karimnagar: అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ పోలీసుల ఉక్కుపాదం!  

Karimnagar: ఈరోజు ఉదయం కరీంనగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో, దుర్షేడు వైపు నుంచి కరీంనగర్ వైపు ఇసుక లోడుతో వస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేశారు.

ట్రాక్టర్లలో ఉన్న ఇసుకకు సంబంధించి అనుమతులు, రవాణా పత్రాలు చూపించాలని పోలీసులు కోరగా, డ్రైవర్లు తాము బొమ్మకల్ మరియు చేగుర్తి ప్రాంతాలకు చెందిన వారమని, చేగుర్తి ప్రాంతంలోని ఇసుక బాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను ట్రాక్టర్లలో నింపుకొని, కరీంనగర్‌లో అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిపారు.

దీంతో పోలీసులు మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, పంచనామా నిర్వహించి, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి కేసులు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు.

అదేవిధంగా, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిని సంబంధిత తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినట్లు రికార్డులు ఉంటే, నిబంధనల ప్రకారం వారి వివరాలను నమోదు చేసి షీట్ ఓపెన్ చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇకపై కూడా అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో ట్రాక్టర్లను సీజ్/సీజ్ చేసి డ్రైవర్లు మరియు ఓనర్లు అయినా ఎగురుల వెంకటేశం మరియు గన్ను మణిదీప్ మరియు భూతం మధు అను వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపడతామని ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story