Karimnagar: అక్రమ ఇసుక రవాణా గుట్టు రట్టు.. మూడు ట్రాక్టర్లు సీజ్!
Karimnagar: కరీంనగర్ రూరల్ మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.
Karimnagar: అక్రమ ఇసుక రవాణా గుట్టు రట్టు.. మూడు ట్రాక్టర్లు సీజ్!
Karimnagar: కరీంనగర్ రూరల్ మండలంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సందర్భంగా, గోపాల్‌పూర్ నుండి తీగలగుట్టపల్లికి వెళ్లే రోడ్డుపై ఇసుక లోడుతో వెళ్తున్న మూడు ట్రాక్టర్లను కరీంనగర్ రూరల్ పోలీసులు అడ్డుకొని తనిఖీ చేశారు. తనిఖీలో సంబంధిత ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
విచారణలో ట్రాక్టర్ల యజమానులు నాగపూరి విజయ్, నాగపూరి అజయ్, నాగపూరి శ్రీనివాస్ రేవడ్ల వెంకటేష్ చింతగుంట గ్రామలకు చెందిన ట్రాక్టర్ల ద్వారా గొల్లపల్లి మహానేరువాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు వెల్లడైంది. ట్రాక్టర్ల డ్రైవర్లు సుధగోని భరద్వాజ్, పిట్టల రవి, శివరాత్రి అభిలాష్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని, ముగ్గురు యజమానులు మరియు ముగ్గురు డ్రైవర్లపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను కోర్టులో హాజరుపరచడంతో పాటు ట్రాక్టర్లను కూడా కోర్టుకు అప్పగించనున్నారు.
అలాగే నిందితులను కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఎదుట హాజరుపరచగా, ఇకపై అక్రమ ఇసుక రవాణాకు పాల్పడబోమని హెచ్చరిక జారీ చేశారు. నిందితుల్లో నాగపూరి అజయ్ రెండోసారి ఇదే నేరానికి పాల్పడినందున, బైండ్ ఓవర్ చర్యలు చేపట్టి, ఒక లక్ష రూపాయల బాండ్‌పై ఉంచడంతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే ఒక లక్ష రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుందని ఆదేశించారు.
ఇకపై ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు తెరవడం జరుగుతుందని, అయినప్పటికీ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.




