Sircilla: సీసీ కెమెరాల పర్యవేక్షణలో వినాయక నిమజ్జనం: సిరిసిల్ల పోలీసులు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నడుమ వినాయక నిమజ్జన శోభాయాత్ర అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.
Sircilla: సీసీ కెమెరాల పర్యవేక్షణలో వినాయక నిమజ్జనం: సిరిసిల్ల పోలీసులు!
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. శోభాయాత్ర నేపథ్యంలో జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
పట్టణంలోని ప్రధాన వీధులు, కూడళ్లు, గణేష్ నిమజ్జన ప్రదేశాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్రను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు తలెత్తితే వైర్‌లెస్ ద్వారా సంబంధిత సిబ్బందికి వెంటనే సమాచారం అందిస్తూ తక్షణ చర్యలు చేపడుతున్నారు.
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. శోభాయాత్రకు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.




