Renigunta: 3వ వార్డు అభివృద్ధే లక్ష్యం.. రాజశేఖర్ ఇంటింటి ప్రచారం!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట గ్రామ పంచాయతీ 3వ వార్డు అభ్యర్థి కే. రాజశేఖర్‌కు మద్దతుగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఇంటింటి ప్రచారం నిర్వహించి పోస్ట్ బాక్స్ గుర్తుపై ఓట్లు అభ్యర్థించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 25 Nov 2026 2:27 PM IST
Renigunta
X

Renigunta: 3వ వార్డు అభివృద్ధే లక్ష్యం.. రాజశేఖర్ ఇంటింటి ప్రచారం!

రేణిగుంట: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో రేణిగుంట 3వ వార్డు అభ్యర్థిగా కే. రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తనకు కేటాయించిన పోస్ట్ బాక్స్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వార్డు ఓటర్లను అభ్యర్థించారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా పాల్గొని రాజశేఖర్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

వార్డులోని ఇళ్లకు వెళ్లి ఓటర్లను నేరుగా కలుసుకుంటూ ఎన్నికల కరపత్రాలను పంపిణీ చేశారు. అభ్యర్థి రాజశేఖర్‌కు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలతో తనకు అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొంటూ పోస్ట్ బాక్స్ గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.నవంబర్ 26వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేపట్టారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA