Karimnagar: రైతుల కోసం సమరశీల పోరాటాలు!

Karimnagar: కొత్తగూడెంలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభల్లో కరీంనగర్ జిల్లా ప్రతినిధుల గర్జన.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 24 April 2026 3:45 PM IST
Karimnagar
X

Karimnagar: రైతుల కోసం సమరశీల పోరాటాలు!

Karimnagar: కరీంనగర్ జిల్లాలో రైతాంగం అన్ని విధాలుగా పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతున్నారని, దోపిడీకి వ్యతిరేకంగా సంఘటిత సమరశీల పోరాటాలు నిర్వహించి రైతాంగానికి అండగా ఉంటామని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు.

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈనెల 23, 24, 25 తేదీల్లో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభల్లో కరీంనగర్ జిల్లా నుండి ఎంపిక చేసిన 15 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. శుక్రవారం రోజున జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టిన నివేదికపై చర్చలో పాల్గొని, జిల్లా ఉద్యమ నిర్మాణం, జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.

రాబోయే కాలంలో జిల్లాలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై నికరమైన, సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. భూ సమస్యలు, వరి కొనుగోలు కేంద్రాలు, సాగునీరు, పంటల బీమా, రైతు భరోసా, గిట్టుబాటు ధరలు, పెన్షన్, హెల్త్ కార్డులు, బ్యాంకు రుణాలు, నకిలీ ఎరువు పురుగుమందులు తదితర సమస్యలపై జిల్లా వ్యాప్త పోరాటాలు నిర్వహిస్తామన్నారు.

ఈ మహాసభలో జిల్లా అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు గుండేటి వాసుదేవ్, సహాయ కార్యదర్శులు చెలుపురి రాములు, కె .అరుణ,శీలం అశోక్, జె. జనార్దన్ రెడ్డి, కోశాధికారి బాసిర సంపత్ రావు, జిల్లా కమిటీ సభ్యులు కాల్వ సురేష్, తిప్పరబోయిన శ్రీకాంత్, సంజీవరెడ్డి రమేష్, తిరుపతి రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story