Jagtial: వెల్దుర్తిలో తీవ్ర విషాదం.. డ్రైవర్ రమేష్ బలవన్మరణం!

Jagtia: వెల్దుర్తిలో దారుణం రావాల్సిన రూ. 500 అడిగినందుకు ఇంటికొచ్చి దాడి చేయడంతో మనస్తాపం చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రమేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ANAND, JAGITYAL
Published on: 9 Aug 2026 11:03 PM IST
Jagtial
X

Jagtial: వెల్దుర్తిలో తీవ్ర విషాదం.. డ్రైవర్ రమేష్ బలవన్మరణం!

జగిత్యాల: ట్రాక్టర్ యాజమాని తనకు రావాల్సిన 500 రూపాయలు ఇవ్వమన్నందుకు ఇవ్వకపోగా ఇంటికి వెళ్లి దాడి చేయటంతో అవమానం భరించలేక ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం వెల్దుర్తిలో ఆదివారం చోటు చేసుకుంది.

జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గడ్డం గంగారెడ్డి అనే వ్యక్తి వద్ద వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రమేశ్ అనే ట్రాక్టర్ డ్రైవర్‌ అతని ట్రాక్టర్‌ నడిపేంందుకు పని చేస్తున్నాడు... అయితే రమేశ్‌కు రావాల్సిన 500లు తరచూ అడిగిన ఇవ్వక పోవటంతో శనివారం యాజమానికి గంగారెడ్డికి ఫోన్ చేసి మందిలించి తిట్టాడు.. ఆదివారం ఉదయం నన్నే తిడుతావా అంటూ గంగారెడ్డి, మరోకరు వెల్దుర్తిలోని రమేశ్ ఇంటికి వెళ్లి భార్య, పిల్లల ముందే దారుణంగా దాడి చేసి కోట్టారు.

రమేశ్ సృహ తప్పిపడిపోవటంతో గంగారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి ఇంటికి తీసుకు వచ్చి వదిలిపెట్టాడు.. కొద్దిసేపటికి తీవ్రంగా మనస్థాపం చెందిన డ్రైవర్‌ రమేశ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు పంచనామ నిర్వహించిన దాడి చేసిన గంగారెడ్డితోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. రూ.500 కోసం ప్రాణం తీశారని కుటుంబం సభ్యులు రోదించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story