Jammikunta: ఉప్పల్ భూపోరాటానికి వెళ్తుండగా జమ్మికుంటలో అంబాల హరీష్ అరెస్ట్
Jammikunta: నాచారంలో అమరవీరుల స్మారక స్థలం కోసం తెలంగాణ రక్షణ సేన భూపోరాటం. కవిత పిలుపుతో ఉప్పల్ వెళ్తున్న అంబాల హరీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Jammikunta: ఉప్పల్ భూపోరాటానికి వెళ్తుండగా జమ్మికుంటలో అంబాల హరీష్ అరెస్ట్
జమ్మికుంట: ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ అమరవీరుల స్మారక నిర్మాణం కోసం 250 గజాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్.
చేస్తూన తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూపోరాటానికి మద్దతుగా హైదరాబాద్‌కు బయలుదేరిన కారీంనగర్ జిల్లా జమ్మికుంట మండల ఇన్‌చార్జి అంబాల హరీష్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు ఉప్పల్‌లో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా అంబాల హరీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ అమరవీరుల త్యాగాలను చిరస్థాయిగా నిలబెట్టేందుకు నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో 250 గజాల స్థలాన్ని ప్రభుత్వం వెంటనే కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో చేపట్టిన భూపోరాటానికి వెళ్లకుండా ముందస్తుగా జమ్మికుంట పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నాయకులు ఖండించారు.




