Sircilla: మానేరు వాగులో తృటిలో తప్పిన ప్రమాదం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మానేరు వాగులో వరద ఉధృతికి బైక్‌తో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను స్థానికులు తాడుతో సాహసోపేతంగా కాపాడారు.

KALEEM, SIRICILLA
Published on: 5 Aug 2026 10:09 AM IST
Sircilla
X

Sircilla: మానేరు వాగులో తృటిలో తప్పిన ప్రమాదం!

Sircilla: మానేరు వాగులో తృటిలో తప్పిన ప్రమాదం.. స్థానిక యువకుల సాహసంతో ఇద్దరి ప్రాణాలు కాపాడిన ఘటన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర–రామలక్ష్మణపల్లె గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగు కాజ్‌వేపై వరద ఉధృతి మధ్య ఇద్దరు యువకులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ పల్సర్ బైక్‌పై కాజ్‌వే దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులు అదుపు తప్పి బైక్‌తో పాటు వాగులో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు సహాయం కోసం కేకలు వేశారు.

వారి అరుపులు విన్న పదిర గ్రామానికి చెందిన స్థానిక యువకులు వెంటనే తాడుతో సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇద్దరు యువకులను, వారి బైక్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. స్థానిక యువకుల సాహసాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కాజ్‌వేలు, లోతట్టు వంతెనలు దాటకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story