Karimnagar: ఆటోలో మరిచిపోయిన పర్సు, మొబైల్ ఫోన్ గంటల్లోనే రికవరీ!
Karimnagar: ఆటోలో ప్రయాణిస్తూ మొబైల్ ఫోన్, పర్సు మరిచిపోయిన బాధితుడి ఫిర్యాదుపై స్పందించిన II టౌన్ పోలీసులు సాంకేతిక సాయంతో వాటిని రికవరీ చేసి అప్పగించారు.
Karimnagar: ఆటోలో మరిచిపోయిన పర్సు, మొబైల్ ఫోన్ గంటల్లోనే రికవరీ!
కరీంనగర్: నగరానికి చెందిన ముప్పిడి రాకేష్ రాంనగర్ నుండి గీతాభవన్ వైపు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో తన పర్సు, మొబైల్ ఫోన్‌ను ఆటోలో మర్చిపోయారు. ఆటో దిగిన తర్వాత తన వస్తువులు కనిపించకపోవడంతో కరీంనగర్ II టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.
సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిన పోలీసులు.విషయం తెలుసుకున్న II టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి వెంటనే స్పందించి, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేయాలని ఆదేశించారు.ఈ మేరకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం మరియు మొబైల్ లొకేషన్ సహాయంతో ఫోన్‌ను ట్రేస్ చేసి, పర్సు మరియు మొబైల్ ఫోన్‌ను గుర్తించారు. అనంతరం వాటిని సురక్షితంగా బాధితుడు ముప్పిడి రాకేష్ కి అప్పగించారు.
పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు.తన వస్తువులు తిరిగి లభించడంతో ముప్పిడి రాకేష్ సంతోషం వ్యక్తం చేస్తూ, వెంటనే స్పందించి తన పర్సు మరియు మొబైల్‌ను గుర్తించి అందజేసిన కరీంనగర్ II టౌన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసుల సూచన.ప్రజలు ఆటోలు బస్సుల్లో ప్రయాణిస్తున్న సమయంలో తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని టూ టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి తెలిపారు. అజాగ్రత్తల వల్ల చాలా విలువైన వస్తువులను కోల్పోతే చాలా బాధగా ఉంటుందని ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. ప్రజలు ప్రయాణం చేస్తున్న సమయంలో వాహనం నుండి దిగుతున్న సమయంలో తమ వస్తువులు అన్నీ తమ వింటే ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలన్నారు.
సిబ్బందిని అభినందించిన టూ టౌన్ ఇన్స్పెక్టర్.ఈ ఘటనలో చొరవ చూపి వస్తువులను ట్రేస్ చేయడంలో పాల్గొన్న ఎస్ఐ శ్రీనాథ్, సీడీఆర్ ప్రదీప్ మరియు కానిస్టేబుల్ సాయికిరణ్‌లను II టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి అభినందించారు.




