Karimnagar: యుఏఈలో ఘనంగా ఎటిసిఎ (ETCA) బోనాల మహోత్సవం!
Karimnagar: రాస్ అల్ ఖైమాలో ఈటిసిఎ (ETCA) ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు.
Karimnagar: యుఏఈలో ఘనంగా ఎటిసిఎ (ETCA) బోనాల మహోత్సవం!
Karimnagar: యూఏఈలోని రాస్ అల్ ఖైమా మైత్రి ఫార్మ్స్‌లో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.యూఏఈలోని వివిధ ఎమిరేట్స్‌ల నుంచి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ETCA ఆధ్వర్యంలో వరుసగా నాలుగోసారి నిర్వహించిన ఈ వేడుకలో గౌరమ్మ పూజ, బోనాల సమర్పణ, కుంకుమార్చన, మహాహారతి, దీపోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పట్టు చీరలు ధరించిన మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ నిర్వహించిన ఊరేగింపు, ఒగ్గు డోలు మోతలు, పోతురాజుల విన్యాసాలు తెలంగాణ సంస్కృతిని విదేశీ నేలపై ఆవిష్కరించాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైత్రి గ్రూప్ వ్యవస్థాపకులు కొత్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, విదేశాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తున్న ETCA సభ్యులను అభినందించారు.ETCA వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచర, అధ్యక్షుడు జగదీష్ రావు మాట్లాడుతూ, విదేశాల్లో జన్మించిన భావితరాలకు తెలంగాణ పండుగల గొప్పతనాన్ని పరిచయం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అనంతరం భక్తులందరికీ మహాప్రసాదం పంపిణీ చేసి, తెలంగాణ సంప్రదాయ వంటకాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విదేశాల్లో ఉన్నామనే భావన కలగకుండా స్వగ్రామంలో బోనాలు జరుపుకున్న అనుభూతి కలిగిందని తెలంగాణ ప్రవాసులు నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ETCA వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచర, అధ్యక్షుడు జగదీష్ రావు చీటీ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఎలిగేటి, ప్రధాన కార్యదర్శి రాణి కొట్ల, సంయుక్త కార్యదర్శి శేఖర్ గౌడ్ గుండవేని, కోశాధికారి తిరుమల్ రావు బీరెల్లి, మాజీ అధ్యక్షులు రాధారపు సత్యం, సీనియర్ సభ్యులు వెంకటేశ్వర్ రావు, ఎస్.పీ. కస్తూరి, సురేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వినోద్ ఆచారి, రఘు ఎలిగేటి, రాము కందుకూరి, సామ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ పోలంపల్లి, కిరణ్ చెట్టిగారి, సారిక పీచర, మమత కస్తూరి, అన్నపూర్ణ, మౌనిక గౌడ్, మధు కుమార్, వనజ గోగుల, రనీషా, విపుల, స్వప్న, దీపిక తదితరులు, మహిళా విభాగ సభ్యులు, వాలంటీర్లు మరియు యూఏఈ నలుమూలల నుంచి వచ్చిన తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




