Yellareddypeta: రాచర్ల గొల్లపల్లి పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

Yellareddypeta: రాచర్ల గొల్లపల్లి జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ. పాల్గొన్న సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, పాఠశాల కమిటీ సభ్యులు.

KALEEM, SIRICILLA
Published on: 16 Sept 2026 5:59 PM IST
Yellareddypeta
X

Yellareddypeta: రాచర్ల గొల్లపల్లి పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అందించిన ఉచిత ఏకరూప దుస్తులను గ్రామ ప్రజాప్రతినిధులు, పాఠశాల కమిటీ ప్రతినిధులు విద్యార్థులకు అందజేశారు.

గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జనగామ రమ, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పాఠశాల మాజీ కమిటీ చైర్మన్ గోగూరి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఏకరూప దుస్తులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏకరూప దుస్తులు విద్యార్థుల్లో సమానత్వం, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ చదువులో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అనంతరం ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. రత్నాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించిన ఏకరూప దుస్తులను ప్రతిరోజూ ధరించి విద్యార్థులు పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమానికి సహకరించిన సర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA