Karimnagar: కరీంనగర్‌లో బండి సంజయ్ బర్త్‌డే వేడుకలు

Karimnagar: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు కరీంనగర్‌లో ఘనంగా జరిగాయి.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 11 July 2026 12:14 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో బండి సంజయ్ బర్త్‌డే వేడుకలు

కరీంనగర్: కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకల నగరంలో ఘనంగా నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు కోదండ రామాయణంలో ప్రత్యేక పూజలు పూల మొక్కల పంపిణీ తెలంగాణ చౌక్ లో 54 కిలోల భారీ కేక ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ చౌకలో మిఠాయిలు పంచి టపాసులు కాల్చి డాన్సులు చేస్తూ శాంతి కపోతలను ఎగురవేసి వేడుకలు ఘనంగా జరిపారు.

అనంతరం బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి నుంచి కేంద్ర సహాయ శాఖ మంత్రిగా బండి సంజయ్ అంచలంచిగాళ్ళుగా ఎదిగాడని అలాంటి నాయకుడు ఆదర్శనీయుడన్నారు బండి సంజయ్ మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు.

స్కూల్ పిల్లలకు బ్యాగులు పంపిణీ..

డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు బ్యాగులు, బ్యాడ్జీలు, టైలు, షూస్ పంపిణీ చేశారు. భగత్ నగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గల ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అంచలంచలుగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచిన బండి సంజయ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కేంద్ర సహాయ మంత్రిగా నగర అభివృద్ధి కోసం కేంద్రం నుండి నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నాడని ఇలాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టమని అన్నారు. రాబోవు రోజుల్లో సంజయ్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. బండి సంజయ్ జన్మదిన సందర్భంగా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు కార్పొరేటర్లు ప్రజలు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story