Karimnagar: సిక్కు బంధువులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్!
Karimnagar: సిక్కు బంధువులందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
Karimnagar: సిక్కు బంధువులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్!
Karimnagar: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిక్కు బంధువులందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ అంటే ఒక మతానికి చెందిన గురువు మాత్రమే కాదు. యావత్ మానవాళికి మార్గదర్శకుడని కొనియాడారు. ఆయన చూపించిన మార్గం మానవత్వానికి మార్గం.. సమానత్వానికి మార్గం.. సేవకు మార్గమని పేర్కొన్నారు. ఈ మేరకు ఈరోజు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
గురునానక్ ప్రపంచానికి మూడు గొప్ప సందేశాలు ఇచ్చారు. 1.కీరత్ కరో – నిజాయితీగా కష్టపడి పనిచేయండి. 2.నామ్ జపో – భగవంతుడిని స్మరించండి. 3.వండ్ చకో – సంపాదించిన దానిని ఇతరులతో పంచుకోండి. ఈ 3 సూత్రాలు ప్రతి మనిషి జీవితంలో ఆచరిస్తే సమాజంలో ఆకలి ఉండదు.. అసమానత ఉండదు.. విద్వేషాలకు చోటుండదు.
గురునానక్ దేవ్ జీ బోధనలు చిరస్మరణీయం కావాలి. సిక్కు గురువుల త్యాగాలు అజరామరం కావాలి. అంతెందుకు గురుద్వారాల్లో నిర్వహించే లంగర్ సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శం. అక్కడ పేదవాడు, ధనవంతుడు అనే తేడా లేదు. కులం, మతం, హోదా అనే భేదాలు లేవు.
అందరూ ఒకే వరుసలో కూర్చుని భోజనం చేస్తారు. ఆకలితో వచ్చిన వ్యక్తికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి ఉండదు. ఇది కేవలం అన్నదానం కాదు. సమానత్వానికి నిలువెత్తు నిదర్శనం. సిక్కు సమాజం ప్రపంచానికి నేర్పిన గొప్ప సంస్కారం ఇదే. గురునానక్ స్పూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ హితానికి పాల్పడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.




