Karimnagar: బండి సంజయ్ తల్లికి తీవ్ర గుండెపోటు.. ఆస్పత్రికి పరుగులు తీసిన మంత్రి!
Karimnagar: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాతృమూర్తి శకుంతల గారికి గుండెపోటు వచ్చింది.
Karimnagar: బండి సంజయ్ తల్లికి తీవ్ర గుండెపోటు.. ఆస్పత్రికి పరుగులు తీసిన మంత్రి!
కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోమ్ సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలకు గుండెపోటు రావడంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించిన కుటుంబ సభ్యులు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది సంజయ్ తల్లిని పరీక్షించి గుండెకు స్టంట్ వేసి అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ చేరుకొని తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తన తల్లి వద్దకు చేరుకొని పరమార్శించి తల్లికి ఏం కాదు అని భరోసా కల్పించారు. బండి సంజయ్ కుటుంబ సభ్యులు కూడా హైదరాబాదులోనే ఉన్నట్లు తెలిసింది. మెడికవర్ వైద్యులకు తన తల్లికి మెరుగైన చికిత్స అందించాలని కోరినట్లు వినికిడి.




