Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!

Karimnagar: కరీంనగర్ కోతిరాంపూర్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్ నివాళులర్పించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 2 Oct 2026 3:10 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!

Karimnagar: కరీంనగర్ కోతిరాంపూర్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు కార్పోరేటర్లు.

అహింసను ఆయుధంగా...సత్యమే మార్గంగా కోట్లాదిమంది భారతీయుల్లో స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించిన గొప్ప మహనీయులు మహాత్మాగాంధీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని కోతిరాంపూర్ వద్ద ఆయన విగ్రహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు కార్పోరేటర్లు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నినాధాలు చేస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సంధర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్పూర్తి అన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమన్నారు. సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను ఆచరించి వాటి శక్తిని ప్రపంచానికి చాటిన గాంధీ జీవితం యావత్ మానవాళికి స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. చంపారన్ సత్యగ్రహం, బ్రిటిష్ వస్తువులు, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో పోరాటాలు దేశానికి ఆదర్శం అన్నారు.

​ఈ కార్యక్రమంలో పలువురు బీజేపి కార్పోరేటర్లు, వైశ్యసంఘ నాయకులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN