Karimnagar: గాలివాన బీభత్సం.. బాధితులకు తక్షణ సాయం అందిస్తామన్న కేంద్ర మంత్రి
Karimnagar: కరీంనగర్‌లో గాలివాన బీభత్సం.. బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తక్షణ సాయం అందిస్తామని హామీ.
Karimnagar: గాలివాన బీభత్సం.. బాధితులకు తక్షణ సాయం అందిస్తామన్న కేంద్ర మంత్రి
కరీంనగర్: గాలి వాన భీభత్సానికి కరీంనగర్ లో పలు చోట్ల కూలిన చెట్లు, విరిగిపడ్డ కరెంట్ పోల్స్. కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ 5వ వార్డులోని వడ్డెర కాలనీలో గాలివాన భీభత్సానికి కూలిన ఇండ్లను పరిశీలించిన కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్.వడ్డెర కాలనీలో గండికోట రాజేశ్ ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా వారికి ఇల్లు నిర్మాణానికి తక్షణ సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అకాల వర్షం వల్ల ఇండ్లు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి తక్షణ సహాయం అందిస్తామని తెలిపారు. గాలివాన బీభత్సాల వల్ల కోటింగులు కూలి ప్రమాదాలు దారి తీసే అవకాశాలు ఉందన్న నగరంలో హోర్డింగ్ ల పటిష్టతపై కమిటీ వేయనున్నట్లు చెప్పారు.
గాలి వాన భీభత్సానికి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పరస్పర విమర్శలకే పరిమితమవుతున్నారే తప్ప రైతులను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.ఇకనైనా యుద్ద ప్రాతిపదికన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షానికి తడిసిన ప్రతి గింజను గోలు చేయాలని లేనియెడల రైతుల పక్షాన పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి తో పాటు కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




