Karimnagar: కరీంనగర్‌లో దుర్గా మండపాలను దర్శించిన బండి సంజయ్

Karimnagar: కరీంనగర్‌లో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు దుర్గాదేవి మండపాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించి పూజలు చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 21 Oct 2026 6:09 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో దుర్గా మండపాలను దర్శించిన బండి సంజయ్

కరీంనగర్: కరీంనగర్ నగరంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు దుర్గాదేవి మండపాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దేశం మరియు రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా అశోక్ నగర్ లోని శ్రీ దుర్గా సేవా సమితి, టవర్ సర్కిల్లోని ఫ్రెండ్స్ అసోసియేషన్, కమాన్ వద్ద కమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవార్లకు మరియు నగునూరు శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని ఆలయంలో లోని దుర్గాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ తో పాటు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN