Peddapalli: ఎంపీ కార్యక్రమానికి హాజరైతే సస్పెండ్ చేస్తారా కొయ్యూరు ఉపసర్పంచ్
Peddapalli: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కార్యక్రమానికి హాజరైనందుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడంపై మంథని నియోజకవర్గం కొయ్యూరు ఉపసర్పంచ్ సవేందర్ ఆవేదన.
Peddapalli: ఎంపీ కార్యక్రమానికి హాజరైతే సస్పెండ్ చేస్తారా కొయ్యూరు ఉపసర్పంచ్
పెద్దపల్లి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కార్యక్రమానికి హాజరైన కారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మంథని నియోజకవర్గం కొయ్యూరు గ్రామ ఉపసర్పంచ్ లక్కవు సవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
కొయ్యూరు గ్రామంలో పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వస్తున్నారని, స్థానిక నాలుగో వార్డు సభ్యురాలు లక్ష్మి, ఆమె భర్త తిరుపతి ఫోన్ చేసి ఆహ్వానించడంతో ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. ఎంపీ కార్యక్రమానికి హాజరైన అదే రోజు సాయంత్రం తమను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ మీడియా ద్వారా ప్రకటించడం బాధ కలిగించిందన్నారు.
తమపై వచ్చిన ఫిర్యాదు ఏమిటో తెలియజేయకుండా, కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా, ఎలాంటి విచారణ చేపట్టకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. మండల నాయకత్వాన్ని ప్రశ్నించగా, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకే సస్పెన్షన్ చేసినట్లు తెలిపారని పేర్కొన్నారు.
పార్టీ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, మంత్రి శ్రీధర్ బాబు కోసం పుష్కరాల సమయంలో సొంత ఖర్చులతో పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేసి, ఆపదలో ఉన్నవారికి సహాయం అందించానని గుర్తు చేశారు.
ఈ వ్యవహారంపై న్యాయం కోరుతూ హైదరాబాద్ గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు అందించాల్సిన వినతిపత్రాన్ని పార్టీ ఉపాధ్యక్షుడు కుమార్ రావుకు ఇచ్చానని, ఇప్పటివరకు అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ విషయాన్ని మరోసారి పార్టీ రాష్ట్ర నాయకత్వం, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.




