Sircilla: 17వ పోలీస్ బెటాలియన్‌లో వాల్మీకి జయంతి వేడుకలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ ఐఆర్ పోలీస్ బెటాలియన్‌లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Oct 2026 3:43 PM IST
Sircilla
X

Sircilla: 17వ పోలీస్ బెటాలియన్‌లో వాల్మీకి జయంతి వేడుకలు!

Sircilla: 17వ (ఐఆర్) పోలీస్ బెటాలియన్‌లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణ మహాకావ్యాన్ని రచించి భారతీయ సాహిత్యానికి విశేష సేవలందించారని తెలిపారు. శ్రీరాముని జీవితం ద్వారా ధర్మం, సత్యం, న్యాయం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను సమాజానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి రచనలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తూ, మానవతా విలువలు, ఆదర్శవంతమైన జీవన విధానంపై ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు.

వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మం, న్యాయం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మహనీయుల జయంతి వేడుకల ద్వారా వారి ఆశయాలు, బోధనలను భావితరాలకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం. రాజుతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొని వాల్మీకి మహర్షికి ఘనంగా నివాళులర్పించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA