Peddapalli: కొమిర ప్రభుత్వ పాఠశాలలో వైభవంగా వనమహోత్సవం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర ప్రభుత్వ పాఠశాలలో వనమహోత్సవం. మొక్కలు నాటి, ఉచితంగా పంపిణీ చేసిన సర్పంచ్ గోలి లింగారెడ్డి.
Peddapalli: కొమిర ప్రభుత్వ పాఠశాలలో వైభవంగా వనమహోత్సవం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం 'వన మహోత్సవం' కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ గోలి లింగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు వివిధ రకాల పూల మొక్కలను నాటారు. అనంతరం గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రామ ప్రజలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఉచితంగా పూల మరియు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గోలి లింగారెడ్డి మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, పెద్దది చేసే వరకు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి ఇంట్లో, పాఠశాలల్లో మొక్కలు పెంచడం ద్వారా గ్రామాన్ని పచ్చని వాతావరణంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని కానుకగా అందించాలంటే చెట్లను పెంచడం ఒక్కటే మార్గమని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, ఉప సర్పంచ్ మూల సంపత్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ రమా, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.




