Jammikunta: జమ్మికుంటలో సరికొత్త వాసవి మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం!

Jammikunta: జమ్మికుంట కొండూరు కాంప్లెక్స్‌లో వాసవి మినీ ప్రైవేట్ థియేటర్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 10 July 2026 5:16 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో సరికొత్త వాసవి మినీ ప్రైవేట్ థియేటర్ ప్రారంభం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్‌లో,భారత్ గ్యాస్ ఆఫీస్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వాసవి మినీ ప్రైవేట్ థియేటర్ ను ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించిన ఘనంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ థియేటర్‌ను ప్రారంభించి నిర్వాహకులు యాద శ్రీధర్, అనంతుల సురేష్,తంగళ్ళపల్లి శ్యామ్ కిషోర్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపుట్టినరోజులు,వివాహ వార్షికోత్సవాలు, కుటుంబ వేడుకలు, స్నేహితుల ప్రత్యేక సమావేశాలు వంటి కార్యక్రమాలను ప్రైవేట్ వాతావరణంలోనిర్వహించుకునేందుకు ఈథియేటర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చందా రాజు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు లెంకలపల్లి శరత్,బచ్చు భాస్కర్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story