Peddapalli: జాతీయ కరాటే పోటీలలో వశిష్ట విద్యార్థుల ప్రతిభ - స్వర్ణ, రజత పతకాలు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి వశిష్ట స్కూల్ విద్యార్థులు జాతీయ కరాటే పోటీల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించి ప్రశంసలు అందుకున్నారు.
Peddapalli: జాతీయ కరాటే పోటీలలో వశిష్ట విద్యార్థుల ప్రతిభ - స్వర్ణ, రజత పతకాలు!
Peddapalli: హన్మకొండ జిల్లాలో షాడో షోటోకన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ లెవల్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్-2026 పోటీలలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామానికి చెందిన "వశిష్ట ఇంగ్లీష్ మీడియం స్కూల్" విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.
ఈ పోటీలలో పాఠశాలకు చెందిన 4వ తరగతి విద్యార్థిని కల్వల రితన్య గోల్డ్ మెడల్ సాధించగా, 3వ తరగతి విద్యార్థినులు ఆడెపు ఆద్య, పుల్లూరి దామిని రజత (సిల్వర్) మెడల్స్ కైవసం చేసుకున్నారు.
జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పాఠశాలకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన విద్యార్థులను ప్రిన్సిపాల్స్ మ్యాడగోని కిషన్, మ్యాడగోని దివ్య, కరాటే మాస్టర్ కొండీళ్ల సదానందం అభినందించి, అభినందన పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కల్వల రమాదేవి, పెండం రాజమల్లు, వల్లంబట్ల శివకుమార్, మహమ్మద్ యాకూబ్, బి. సుజాత, టీ. సుజాత, స్వాతి, స్వరూప, ఆర్తి, కోమల, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.




