Veernapally: అధిక శబ్దంతో డీజే పెడితే అంతే సంగతులు.. ఎస్సై వార్నింగ్!
Veernapally: వీర్నపల్లిలో డీజే నిర్వాహకులను బైండోవర్ చేసిన పోలీసులు. అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజేలు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరిక.
Veernapally: అధిక శబ్దంతో డీజే పెడితే అంతే సంగతులు.. ఎస్సై వార్నింగ్!
వీర్నపల్లి: శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వీర్నపల్లి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని DJ నిర్వాహకులను పోలీసులు బైండోవర్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మణ్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా అధిక శబ్దంతో DJలు నిర్వహించడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించడం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
DJ నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.




