Manthani: గురుకుల పేరెంట్స్ కమిటీ చైర్మన్‌గా వేల్పుల కుమారస్వామి విజయం!

Manthani: మంథని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్‌గా వేల్పుల కుమారస్వామి ఎన్నికయ్యారు.

SHANKAR, MANTHANI
Published on: 9 Aug 2026 6:03 PM IST
Manthani
X

Manthani: గురుకుల పేరెంట్స్ కమిటీ చైర్మన్‌గా వేల్పుల కుమారస్వామి విజయం!

మంథాని: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలుర) పెద్దపల్లి జిల్లా మంథని పేరెంట్స్ కమిటీ నూతన చైర్మన్‌గా వేల్పుల కుమారస్వామి ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా డీసీఓ, ప్రిన్సిపాల్ శ్రీనాథ్, వైస్ ప్రిన్సిపాల్ నవీన్ అధ్యక్షతన ఆదివారం పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.

చైర్మన్ పదవికి వేల్పుల కుమారస్వామి, పి.శేఖర్ పోటీ పడగా, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 62 మంది తల్లిదండ్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపులో కుమారస్వామికి 35 ఓట్లు, పి.శేఖర్‌కు 25 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లలేదు. అనంతరం ఎన్నికల ఫలితాలను ప్రిన్సిపాల్ శ్రీనాథ్ ప్రకటించి, కుమారస్వామిని నూతన చైర్మన్‌గా ప్రకటించారు.

ఇతర కమిటీ పదవులకు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్‌గా వేల్పుల మొగిలి, ప్రధాన కార్యదర్శిగా సాదుల శ్రీనివాస్, కోశాధికారిగా జంజర్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా నల్లి సతీష్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా కన్నూరు సదయ్య, వెంకటస్వామి, స్వామి, దండ్రు భూమేష్, గద్దల మహేష్, కాసిపేట సారయ్య, బి.శ్రీనివాస్, ఎన్.సమ్మయ్య, ఎం.శ్రీనివాస్, ఎస్.సారయ్యలను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన చైర్మన్ వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి తల్లిదండ్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల, కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలోనూ హాస్టల్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించామని గుర్తు చేశారు.

భవిష్యత్తులో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రతతో పాటు హాస్టల్ అభివృద్ధికి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల సహకారంతో కృషి చేస్తానన్నారు. తల్లిదండ్రులందరినీ కలుపుకొని విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తానని కుమారస్వామి తెలిపారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story