Vemulawada: భీమేశ్వర స్వామి ఆలయ 27 రోజుల హుండీ ఆదాయం రూ.1.26 కోట్లు

Vemulawada: వేములవాడ అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో 27 రోజుల హుండీ ఆదాయం రూ.1,26,21,819 నగదు, 77.900 గ్రాముల బంగారం, 4.300 కిలోల వెండి లెక్కింపు.

BABU, VEMULAWADA
Published on: 25 Nov 2026 10:03 PM IST
Vemulawada
X

Vemulawada: భీమేశ్వర స్వామి ఆలయ 27 రోజుల హుండీ ఆదాయం రూ.1.26 కోట్లు

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 27 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు.

రూ1,26,21,819/- నగదు రూపం లో ఆదాయంగా వచ్చినట్లు, అదే విధంగా, మిశ్రమ బంగారం 077 గ్రాములు 900 మిల్లి గ్రాములు మిశ్రమ వెండి 04 కిలోల 300 గ్రాములు వచ్చినట్లుగా తెలిపారు.

ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు, కరీంనగర్ ఏసీ ఆఫీస్ పరిశీలకులు రాజమౌళి గారు, డీఈవో నవీన్ కుమార్ శర్మ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, ఎస్ పి ఎఫ్ , హోంగార్డ్స్, శ్రీ రాజరాజేశ్వరి సేవాసమితి వారు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA