Vemulawada: వేములవాడ బండు పార్కును పరిశీలించిన చైర్మన్ పుల్కం రాజు

Vemulawada: వేములవాడ బైపాస్ రోడ్ తాజ్ హోటల్ ముందున్న బండు పార్కులో షార్ట్ సర్క్యూట్‌తో కాలిన గడ్డి తొలగించి శుభ్రం చేయాలని చైర్మన్ పుల్కం రాజు సూచించారు.

BABU, VEMULAWADA
Published on: 28 Nov 2026 6:49 PM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడ బండు పార్కును పరిశీలించిన చైర్మన్ పుల్కం రాజు

వేములవాడ: బైపాస్ రోడ్ లోని తాజ్ హోటల్ ముందర ఉన్న బండు పార్కు ను, *పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు గారు,వైస్ చైర్మన్ నరాల శేఖర్. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు గారు మాట్లాడుతూ ఇటీవలే షార్ట్ సర్క్యూట్ కారణంగా పార్కులో కొంత గడ్డి కాలిపోయిందని అలాగే కాలిపోయిన గడ్డితో పాటు ఎండిపోయిన గడ్డి పిచ్చి మొక్కలు తొలగించి పార్కును పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

పార్కులో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని, పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పార్కును ఉంచాలని సిబ్బందికి సూచించారు పట్టణ ప్రజలకు ఆహ్లాదం,ఆరోగ్యం అందించే పార్కుల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పార్కులో చెట్లు మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు నీరు పోస్తూ వాటిని సంరక్షించాలని పార్క్ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA