Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రోత్సవాలు!
Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు చంద్రఘంటా అలంకారంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.
Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రోత్సవాలు!
Vemulawada: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడవ రోజైన అశ్వయుజ శుద్ధ విదియ అమ్మవారు భక్తులకు "చంద్ర గంట అలంకరణ అలంకారంలో" దర్శనమిచ్చారు. ప్రధానాలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా శాస్త్రోక్తంగా నిర్వహించగా, భక్తుల సౌకర్యార్థం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని మండపంలో అమ్మవారికి ప్రత్యేక దర్శనాలు మరియు పూజా ఏర్పాట్లు చేశారు.
ఉదయకాల పూజా కార్యక్రమాలు:ఉదయం గం. 5:30 నిమిషాల నుండి ప్రారంభమైన పూజా విశేషాలలో భాగంగా...శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకం మరియు అర్చన నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా చేపట్టారు. శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారికి శ్రీ సూక్తం, దుర్గాసూక్తం, లలితా సహస్రనామ అష్టోత్తర నామ సహిత దేవీ చతుష్షస్ట్యోపచార పూజలు ఘనంగా జరిగాయి.
అన్ని అనుబంధ ఆలయాలలో పరివార దేవతలకు అభిషేకాలు, అర్చనలు జరగడంతో పాటు ఉదయం పారాయణములు, జపములు, హోమములు నిర్వహించారు. సాయంత్రపు విశేష కార్యక్రమాలు:సాయంత్రం గం. 4:00 నుండి శ్రీమద్ దేవీభాగవత పురాణ ప్రవచనం కొనసాగింది. దుర్గాసూక్తం, లలితా సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుష్షస్ట్యోపచార పూజ నిర్వహించారు. తదుపరి చంద్ర గంట అలంకరణఅలంకార పూజతో పాటు కన్యా, సువాసినీ పూజను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ అందజేసి, పల్లకీసేవలో హరిహరుల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.




