Vemulawada: వేములవాడలో వైభవంగా నవరాత్రులు

Vemulawada: వేములవాడలో దేవీ నవరాత్రుల 7వ రోజున అమ్మవారు శ్రీ కాలరాత్రి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ప్రత్యేక కుంకుమార్చనలు, మూలా నక్షత్ర సరస్వతీ పూజలు నిర్వహణ.

BABU, VEMULAWADA
Published on: 17 Oct 2026 5:20 PM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడలో వైభవంగా నవరాత్రులు

​వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 11 (లెవెన్ ) 'టైగర్ యూత్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవ మండపంలో దేవీ నవరాత్రుల ఏడవ రోజైన శనివారం అమ్మవారు శ్రీ కాలరాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

​ఈ సందర్భంగా ఉదయం నుంచే మండపంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి గాజుల పూజ, కుంకుమార్చన, విశేష పుష్పార్చనలతో పాటు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతీ పూజను శాస్త్రోక్తంగా జరిపించారు.

​అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకల్లో కాలనీవాసులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

​నేటి విశేషం – శ్రీ కాలరాత్రి దుర్గాదేవి:

​నవరాత్రులలో ఏడవ రోజు ఆరాధించే దుర్గా రూపం కాలరాత్రి. చీకటిని, అజ్ఞానాన్ని, భయాన్ని పోగొట్టి భక్తులకు ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించే తల్లి కనుక ఈమెను 'శుభంకరి' అని కూడా పిలుస్తారు. దుష్ట శక్తులను, శత్రు భయాలను పారద్రోలడానికి కాలరాత్రి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే, శారదా నవరాత్రులలో సప్తమి/మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిని పూజించడం వల్ల విద్యాబుద్ధులు, జ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA