Vemulawada: మర్రిపల్లిలో ఇంటి తాళం పగలగొట్టి చోరీ 1.5 తులాల బంగారం మాయం
Vemulawada: వేములవాడ రూరల్ మర్రిపల్లిలో దొంగతనం. తాళం వేసిన ఇంట్లో 1.5 తులాల బంగారు చైన్, 7 వెండి మొలతాడులు చోరీ. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి.
Vemulawada: మర్రిపల్లిలో ఇంటి తాళం పగలగొట్టి చోరీ 1.5 తులాల బంగారం మాయం
వేములవాడ: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన పాటి కళ్యాణి అనే మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగింది అని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వేములవాడ రూరల్ ఎస్ ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వివరాలు కళ్యాణి తన అమ్మగారి ఇల్లు అయిన నాగయ్య పల్లి కి తేదీ 4-11-2026 రోజున మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి వెళ్లింది.
అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో ఆమె అత్త రమ ఫోన్ చేసి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు వున్నది అని సమాచారం ఇవ్వగా ఇంటికి చేరుకున్న కళ్యాణి ఇంటిని పరిశీలించగా, ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో పాటు బీరువా తాళం కూడా తీసి అందులో భద్రపరిచిన సుమారు 1.5 తులాల బంగారు చైన్,7 వెండి మొలతాడు లు చోరీకి గురైనట్లు గుర్తించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, గుర్తుతెలియని దొంగలను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్టు వేములవాడ రూరల్ ఎస్ ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు.




