Vemulawada: ఫిట్స్‌తో రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

Vemulawada: వేములవాడలో ఫిట్స్‌తో పడిపోయిన వ్యక్తికి కానిస్టేబుళ్లు సల్మాన్, షకీల్ ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. పోలీసుల మానవత్వానికి ప్రశంసలు.

BABU, VEMULAWADA
Published on: 5 Nov 2026 9:23 PM IST
Vemulawada
X

Vemulawada: ఫిట్స్‌తో రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

వేములవాడ: ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకోవడంలోనూ వేములవాడ పట్టణ పోలీసులు ముందున్నారు,వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం శివ అనే వ్యక్తి అకస్మాత్తుగా ఫిట్స్‌ రావడంతో రోడ్డుపై కుప్పకూలిపోయాడు.

ఈ ఘటనను గమనించిన విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్లు సల్మాన్, షకీల్, పంతులు నాయక్, నరేందర్, సతీష్ కుమార్, రాజ్‌కుమార్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బాధితుడి వద్దకు చేరుకొని అత్యవసర పరిస్థితిని గుర్తించిన పోలీసులు బాధితుడికి తక్షణ సాయం అందిస్తూ ప్రథమ చికిత్స చేశారు.

చేతులు, కాళ్లు రుద్దుతూ అతడికి సహాయం చేయడంతో కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చాడు,విధి నిర్వహణలో ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో స్పందించి ఓ నిండు ప్రాణానికి అండగా నిలిచిన పోలీసుల తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తూ యూనిఫామ్ వెనుక మానవత్వం ఉందని చాటిన పోలీసు సిబ్బంది సేవలను అభినందించారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA