Vemulawada: వేములవాడ ప్రెస్ క్లబ్ అందరిదే కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజే వినతి
Vemulawada: ప్రభుత్వ నిధులతో నిర్మించిన వేములవాడ ప్రెస్ క్లబ్ భవనాన్ని అన్ని జర్నలిస్టు సంఘాలు సమానంగా వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం.
Vemulawada: వేములవాడ ప్రెస్ క్లబ్ అందరిదే కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజే వినతి
వేములవాడ: ప్రభుత్వ స్థలం లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన వేములవాడ ప్రెస్ క్లబ్ భవనాన్ని అన్ని జర్నలిస్టు సంఘాల సభ్యులు సమానంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (హెచ్-143) వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు. అధ్యక్షులు కొలిపాక నరసయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేములవాడ ప్రెస్ క్లబ్ భవనం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించబడిన జర్నలిస్టుల అందరి ఆస్తి అని పేర్కొన్నారు. ఈ భవనం ఏ ఒక్క జర్నలిస్టు సంఘానికి మాత్రమే పరిమితం కాకుండా,వేములవాడ ప్రాంతంలోని అన్ని జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలు, సమావేశాలు,శిక్షణా కార్యక్రమాలు,సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేయబడిందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని ఏ ఒక్క సంఘానికే పరిమితం చేయకుండా, గుర్తింపు పొందిన వేములవాడ ప్రాంతంలోని అన్ని జర్నలిస్టు సంఘాల సభ్యులు ఎలాంటి వివక్ష లేకుండా వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.జర్నలిస్టుల ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, సమానత్వం, వివక్ష రహిత విధానం అమలయ్యేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని టీయూడబ్ల్యూజే (హెచ్-143) విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ సభ్యులు జితేందర్, ఉపాధ్యక్షులు సిహెచ్.దేవరాజు, విష్ణు, జబ్బార్, పంపరి నాగరాజు,ఫాహద్, జిల్లా రమేష్, కముటాల విజయ్, చౌటుపల్లి వెంకటేష్, షబ్బీర్, ఇమ్రాన్, అజర్ లు పాల్గొన్నారు.




