Gangadhara: ముచ్చటైన మూడు భాషల శాసనాలు.. కురిక్యాల గుట్టపై చరిత్ర!

Gangadhara: కురిక్యాల బొమ్మలమ్మ గుట్టను సందర్శించిన వేములవాడ సంస్కృత కళాశాల బృందం.

MADHUSUDHANREDDY, CHOPPADANDI
Published on: 9 May 2026 5:49 PM IST
Gangadhara
X

Gangadhara: ముచ్చటైన మూడు భాషల శాసనాలు.. కురిక్యాల గుట్టపై చరిత్ర!

గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని చారిత్రక బొమ్మలమ్మ గుట్టను వేములవాడ ఎస్‌ఆర్‌ఆర్ సంస్కృత కళాశాల అధ్యాపక బృందం సందర్శించింది. కళాశాల ప్రిన్సిపాల్ ఏ. మల్లారెడ్డి, చరిత్ర పరిశోధకులు మరియు ఉపన్యాసకులు డాక్టర్ సంధవేణి తిరుపతి, సంస్కృత ఉపన్యాసకులు ప్రకాష్ తదితరులు బొమ్మలమ్మ గుట్టపై ఉన్న సంస్కృత, తెలుగు, కన్నడ భాషల శాసన విశేషాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానిక కొండన్నపల్లి వాస్తవ్యులు, తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం అధ్యక్షుడు రేండ్ల రాజేష్ వారితో కలిసి గుట్టపైని చారిత్రక ఆధారాలను అధ్యయనం చేశారు. చరిత్ర, తెలుగు, కన్నడ, సంస్కృత సాహిత్యాల్లో బొమ్మలమ్మ గుట్టకు ఉన్న ప్రాధాన్యతను రేండ్ల రాజేష్ వివరించారు.

అలాగే బొమ్మలమ్మ గుట్ట పరిరక్షణ కోసం నిర్వహించిన ఉద్యమం, పోరాట వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ మల్లారెడ్డి తెలుసుకొని అభినందించారు. భావితరాలకు బొమ్మలమ్మ గుట్ట ఒక అమూల్యమైన సాంస్కృతిక వారసత్వ సంపదగా నిలిచిపోతుందని, ఇటువంటి చారిత్రక ప్రదేశాలను అందరూ కాపాడుకోవాలని ఆయన సూచించారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI

MADHUSUDHANREDDY, CHOPPADANDI

Next Story