Karimnagar: వెంకటయ్యపల్లిలో ఆధ్యాత్మిక శోభ.. నూతన శ్రీ సీతారామాలయ ప్రతిష్టాపన!
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటయ్యపల్లిలో నూతన శ్రీ సీతారామాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.
Karimnagar: వెంకటయ్యపల్లిలో ఆధ్యాత్మిక శోభ.. నూతన శ్రీ సీతారామాలయ ప్రతిష్టాపన!
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం వెంకటయ్యపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాలయం భక్తిశ్రద్ధలతో పూర్తయి, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు సిద్ధమైంది. గ్రామ ప్రజలు, దాతల సహకారంతో ఆలయ నిర్మాణం అద్భుతంగా రూపుదిద్దుకుని, ఇప్పుడు భక్తి వాతావరణంలో ఆధ్యాత్మిక కాంతులతో వెలుగొందుతోంది. వెంకటయ్య పల్లి గ్రామములో నిర్మితమైన ఈ శ్రీ సీతారామాలయం గ్రామానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. స్థానిక భక్తులు, యువకులు, పెద్దలు కలిసి స్వచ్ఛందంగా శ్రమించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. ప్రతి పనిలోనూ భక్తి భావం ప్రతిబింబిస్తూ, ఆలయానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. ఆలయ కమిటీ సభ్యుల సమాచారం ప్రకారం రేపటి నుండి మూడు రోజుల పాటు ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, కలశయాత్రలు, భజన. కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.




