Jammikunta: సప్తగిరి రైస్ మిల్లులో రికార్డులు, నిల్వల క్షుణ్ణ పరిశీలన!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో డీజీపీ డి.ఎస్. చౌహాన్ ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిల్వలను తనిఖీ చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 20 July 2026 5:28 PM IST
Jammikunta
X

Jammikunta: సప్తగిరి రైస్ మిల్లులో రికార్డులు, నిల్వల క్షుణ్ణ పరిశీలన!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో రాష్ట్ర డీజీపీ డి.ఎస్. చౌహాన్ ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో ఆర్‌వీఈఓ బస్వరెడ్డి, డీఎస్పీ సీతారెడ్డి, ఎమ్మార్వో దినేష్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ అనిల్ ప్రశాంత్, డీఈ విజయశేఖర్, ఏసీ సురేష్, ఎస్సై రాజేష్, ఏఎస్ఐ ప్రవళికతో పాటు విజిలెన్స్, సివిల్ సప్లైస్ సిబ్బంది పాల్గొన్నారు.తనిఖీల సందర్భంగా మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం, బియ్యం నిల్వలు, రికార్డులు, ప్రభుత్వ నిబంధనల అమలు, నిల్వల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా మిల్లు యాజమాన్యం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా మిల్లుల నిర్వహణ ఉండాలని, అక్రమ నిల్వలు, నాణ్యత లోపాలు లేదా ఇతర ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీలు జిల్లాలోని ఇతర రైస్ మిల్లుల్లో కూడా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story