Gangadhara: అక్రమ లావాదేవీలపై విజిలెన్స్ నజర్.. గంగాధరలో కలకలం
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Gangadhara: అక్రమ లావాదేవీలపై విజిలెన్స్ నజర్.. గంగాధరలో కలకలం
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీ కలకలం రేపింది. సోమవారం ఉదయం ఆకస్మికంగా కార్యాలయానికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పత్రాల పరిశీలన, కార్యాలయ నిర్వహణపై సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా కార్యాలయం వద్ద ఉన్న డాక్యుమెంటర్ల మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏవైనా అక్రమాలు, మధ్యవర్తిత్వం, అనధికార లావాదేవీలు జరుగుతున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగించారు.
విజిలెన్స్ తనిఖీల సమాచారం తెలిసిన వెంటనే పలువురు డాక్యుమెంటర్లు తమ షాపులను మూసివేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో కార్యాలయం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు పలు రికార్డులను పరిశీలించడంతో పాటు, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరించారు.




