Shankarapatnam: అరకండ్ల వాగుపై బ్రిడ్జి నిర్మించాలి.. వాగులో దిగి గ్రామస్తుల నిరసన!

Shankarapatnam: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అరకండ్ల వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, విశారదన్ మహరాజ్ వాగులో దిగి నిరసన చేపట్టారు.

RAJU, HUZURABAD
Published on: 19 Nov 2026 6:50 AM IST
Shankarapatnam
X

Shankarapatnam: అరకండ్ల వాగుపై బ్రిడ్జి నిర్మించాలి.. వాగులో దిగి గ్రామస్తుల నిరసన!

Shankarapatnam: కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం అరకండ్ల గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న అరకండ్ల వాగుకు బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ వాగులోకి దిగి నిరసన వ్యక్తం చేశారు.

ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే అరకండ్ల గ్రామానికి చేరుకుని బ్రిడ్జి నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మధ్యాహ్నం 4 గంటల నుంచి ప్రారంభమైన ఈ నిరసన రాత్రి వరకు కొనసాగుతోంది. కలెక్టర్ సంఘటనా స్థలానికి వచ్చే వరకు, బ్రిడ్జి నిర్మాణంపై హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఎన్ని రోజులైనా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.

అరకండ్ల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాలి.

RAJU, HUZURABAD

RAJU, HUZURABAD