Visakhapatnam: విశాఖ పోలీసుల ఘనత లిక్విడ్ గంజాయి కేడీ అరెస్ట్!
Visakhapatnam: సీపీ బగ్చి ఆదేశాలతో భీమిలి పోలీసులు 24 గంటల్లోనే ఇంటర్-స్టేట్ ఆపరేషన్ , ఒడిశాలో లిక్విడ్ గంజాయి మాస్టర్‌మైండ్ పాంగిని శ్రమించి అరెస్ట్ చేశారు.
Visakhapatnam: విశాఖ పోలీసుల ఘనత లిక్విడ్ గంజాయి కేడీ అరెస్ట్!
Visakhapatnam: విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ శంకబ్రత బగ్చి IPS గారి ఆదేశాల ప్రకారం భీమిలి పోలీసులు రికార్డు సమయంలో సంచలన కేసును చేధించారు.లిక్విడ్ గంజాయి తయారు చేస్తున్న మాస్టర్ మైండ్ పాంగి ని 24 గంటల లోపే ఒడిస్సా రాష్ట్రం, బలియగూడ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆపరేషన్ ను భీమిలి సి.ఐ శ్రీ దివాకర్ యాదవ్ మరియు వారి టీం సమర్థవంతంగా నిర్వహించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విశాఖకు తరలించి తదుపరి విచారణ చేపట్టారు.
డ్రగ్స్, లిక్విడ్ గంజాయి లాంటి మత్తు పదార్థాల సరఫరా పై ఉక్కుపాదం మోపుతామని, ఇలాంటి నేరాల్లో ఎవరు పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని సి.ఐ గారు హెచ్చరించారు.ఈ విజయవంతమైన ఆపరేషన్ కి గౌరవ సీపీ గారికి భీమిలి పోలీసులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Next Story




